సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల నేడు, శుక్రవారం ఉదయం నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయం నందు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు , ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ , స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్, మేడిది జాన్సన్, ప్రముఖ జిల్లా బిసి నేతలు, పలువురు ప్రముఖ నాయకులు, ముఖ్యఅతిధులుగా హజరయ్యారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గోని పుష్పగుచ్ఛాలతో తమ సంఘీభావాన్ని తెలిపారు. వారితో ఎర్రటి ఎండలో విస్సాకోడేరు వరకు కాలిబాటన పాదయాత్రగా వెళ్లిన ఆమె కలెక్టర్ ఆఫీస్ కు వెళ్ళటం తో ఒక కిలో మీటర్ ముందే వారిని వారి వాహనాలను అధికారులు నిలుపుదల చెయ్యడం.. ఎన్నికల నిబంధనలు మేర కలెక్టర్ ఆఫీస్ లో ఆమె మరియు భర్త జగదీష్ ఇంకా మరో ఇద్దరుగా మేడిది జాన్సన్, ప్రసాద్ లను మాత్రమే అనుమతించారు. ఇక్కడ మీడియా పర్సన్ గా మన సిగ్మా న్యూస్ మాత్రమే ఉండటం జరిగింది. ఉమాబాల నామినేషన్స్ పత్రాల స్వీకరణ కార్యక్రమం ముగిసాక మరింత మంది నేతలు ఆమెకు పార్టీ కార్యాలయంలో శుభాభినందనలు తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *