సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ విఫ్, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. భీమవరం పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకుండా వైసిపి పెద్దలు అడ్డుకొన్నారు అంటూ ప్రజలను తప్పు దారి పట్టించే విధంగా మాట్లాడటం తగదని, ఆయన భద్రత కోసమే హెలిప్యాడ్ అక్కడ అనుకూలంగా లేదని, మరో చోటకి మార్చుకోమని అధికారులు చెప్పడం జరిగిందని, దీనిని రాజకీయం చెయ్యడం తగదని అన్నారు. అయిన పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి అంతకు ముందే విజయవాడ ప్రత్యేక విమానంలో చేరుకొన్నారు. మరి అక్కడ నుండి భీమవరం కారులో రావడం ఎంత సేపు.. 2గంటలలో వచ్చేయవచ్చు.. అయన స్పీడ్ కు గంటన్నర సరిపోతుంది. తన క్యాడర్ సమావేశం కోసం ఆ మాత్రం ప్రయాణించలేరా? చంద్రబాబు ను అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ లో ప్రత్యేక విమానం అనుమతించకపోతే ఎక్కడో హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో వచ్చి రోడ్డు ఫై ఆయన చేసిన హడావిడి, తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబు ను పరామర్శించిన తీరు ఎవరు మర్చిపోలేరు. మరి ఆయన క్యాడర్ కోసం మంగళగిరి నుండి భీమవరం రాలేకపోయారంటే వాస్తవాలు జనసేన కార్యకర్తలే అర్ధం చేసుకొని మాట్లాడాలి.. అంతేకాని వైసిపి మీద విషం చిమ్మకండి.. అన్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *