సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో ఇటీవల పూర్తీ అధునాతన హంగులతో పునర్ నిర్మించిన కిరాణా మర్చంట్ అసోసియేషన్ భవనాన్ని నేడు, ఆదివారం ఉదయం, రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. మొదటగా కారుమూరి నరసింహమూర్తి సారథ్యంలో భీమవరం కిరాణా వ్యాపారులు స్వచ్ఛంద సంస్థగా ఉంటూ, అందరికి అందుబాటులో పంక్షన్ హాలుగా నిర్మించిన ఈ భవన నిర్మాణం ఇప్పుడు ఇంత అధునాతనంగా నిర్మిచారంటే దాని వెనక ఎందరో కృషి ఉందని, గతంలో ఈ కిరానా మర్చంట్ అసోసియేషన్ భవనంలోనే మా అమ్మాయి వివాహం జరిగిందని, దీని పాలకవర్గ సభ్యులు కేవలం వారి సంస్థ కార్యకలాపాలే కాకుండా సమాజంలో అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందిస్తూ.. నా వంతు ఈ సంస్థకు ఎల్లవేళలా సహకారం అందిస్తానని మోషేను రాజు భరోసా ఇచ్చారు. సంస్థ నిర్వహకులకు జ్ఞాపికలు అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు అయిత వెంకట కృష్ణారావు అధ్యక్షత వహించగా, కాజల్ దర్శి అద్దంకి వెంకట శివ ప్రసాద్ భవన నిర్మాణం గురించి వివరించారు.టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారధి, కోళ్ళ నాగేశ్వరరావు, తోట భోగయ్య, హాజరు కాగా .. ఈ సందర్భంగా కోయ్యే మోషన్ రాజును , అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. చాంబర్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్త, గునుపూడి తిరుపాల్, ఏ వి ఆర్ సభాపతి, అసోసియేషన్ గండ్రెడ్డి త్రినాధ్ , ప్యాడి అసోసియేషన్ అధ్యక్షులు చవాకులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
