సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు తమ దగ్గర 50వేలు లోపు మాత్రమే నగదు ఉంచుకోవాలి అంతకు మించి ఉన్నట్లయితే దానికి తగిన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలి. (అలాగే బ్యాంకు అకౌంట్లలో కూడా ఒకేసారి ఎక్కువ డబ్బు వస్తే ఆధారాలు ఉండాలి..)ఎందుకంటే నగదు, మద్యం రవాణా అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ భీమవరం శివార్లలో తనిఖీలు చేపడుతోంది.. గత మంగళవారం వీరవాసరం మీదుగా బైక్ ఫై వెళుతున్న ఇద్దరు యువకుల వద్ద నుండి లక్ష రూపాయలు ఆధారాలు చూపని నగదును స్వాధీనం చేసుకోగా భీమవరం పట్టణ శివార్ల లోని కుముదవల్లి రైల్వేగేటు వద్ద వాహనాలను చెక్ చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి నుంచి పది లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు పాలకోడేరు మండల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జ్ ఎంఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు. కుముదవల్లి నుంచి భీమవరం వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద రూ. 10 లక్షలు నగదు దొరికిందని అయితే అతను స్థానిక . మీనా బిస్కెట్ కంపెనీకి డబ్బు ను బ్యాంక్‌కు తీసుకువెళ్తున్నామని చెప్పినప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకుని ఉండి తహాసీల్దార్ కార్యాలయం లో అప్పగించామన్నారు.
