సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆ .. , కల్కి, జంబి రెడ్డి వంటి విభిన్న సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొన్న భీమవరం కుర్రాడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న హను- మాన్ ఫాంటసీ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా మే 12వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసారు. ఇప్పటికే ఈ సినిమాలో గ్రాఫిక్స్ క్వాలిటీ ఫై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నిర్మాతగా సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హను-మాన్‌’. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా షూటింగ్ చివరి రోజు అద్భుతమైన లొకేషన్‌ని చూపించే వీడియోని మేకర్స్ షేర్ చేసారు. మొత్తం ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి 130 వర్కింగ్ డేస్ పట్టింది. హను-మాన్ భారతదేశం అంతటా చిత్రీకరించబడింది. హనుమాన్ జయంతి నాడు విడుదలైన హనుమాన్ చాలీసా కూడా ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. . తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ సినిమాగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *