సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్యాంక్ కాలనీలోని కొపా కళ్యాణ మండపంలో ఈనెల 29వ తేదీన నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని అంకాలజీ, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్ అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా అందిస్తారని, తెలిపారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ డా చందు కృష్ణతేజ, గోపిశెట్టి మురళీకృష్ణ, అరేటీ సత్యనారాయణ, టీడీపి నేతలు కోళ్ల నాగేశ్వర్రావు, పొత్తూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
