సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా (Kopa) కళ్యాణ మండలంలో కాపు అపిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వేల్పేర్ అసోసియేషన్ 30వ వార్షిక కార్తీక వన సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా తులసి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని, కార్తీక మాసంలో వన భోజనాలు ఎంతో ప్రత్యేకమైనవని అన్నారు. సామాజిక సేవలో కోపా ముందుంటుందని అన్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వారిని సత్కరించారు. పలువురికీ విద్య పురస్కారాలను అందించారు. కార్యక్రమంలో అడబాల హనుమాన్, ఉదయశ్రీ దంపతులు, టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, యారంశెట్టి హరినాథ్, కోపా సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *