సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని నేడు, బుధవారం క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జాగుతున్నాయి. గత రాత్రి నుండి స్థానిక చర్చి లలో దివ్య అలంకారాల మధ్య సందడి గ ఏసు ప్రభువు ను ఈ లోకానికి ఆహ్వానిస్తూ కార్యక్రమాలు నాటికలు, కీర్తనలు, ప్రార్ధనలు జరిగాయి. స్థానిక లూథరన్ రూపాంతర దేవాలయం లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ , కొయ్యే మోషేను రాజు మరియు భీమవరం శాసన సభ్యులు, పులపర్తి రామాoజనేయులు పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు ఆప్యాయంగా తినిపించుకొన్నారు. ఈ కార్యక్రమంలో కోళ్ల నాగేస్వరరావు , కారుమూరి సత్యనారాయణ మూర్తి లతో పాటు పాదర్స్ , క్రిస్తవ ప్రముఖులు వైసీపీ , కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *