సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోలో వాడవాడలా నేడు, ఆదివారం వివిధ సంఘాలు ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధనలు పెద్ద ఎత్తున జరుగుతున్నా నేపథ్యంలో.. గునుపూడి లోని వాసవి ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నేడు, ఆదివారం ఉదయం తుమ్మలపల్లి శివ రెస్ మిల్లు ఆవరణం లో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు , వారి కుమారుడు కొయ్యే సుందర్ రాజు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భముగా భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ గౌరవ అడ్జక్షులు మానేపల్లి గుప్త ఆధ్వర్యంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మోషేను రాజు కు సత్కరించడం జరిగింది.
