సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత Dr BR అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా భీమవరం గునుపూడి తాడేరు రోడ్డు లో ఇటీవల ఏర్పాటు చేసిన అంబెడ్కర్ కాంస్య విగ్రహానికి , రాష్ట్ర శాసన మండలి చైర్మన్. కొయ్యే మోషేను రాజు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో నవసమాజం.. సమసమాజం కోసం కృషి చేసిన మహానుభావుడు అంబెడ్కర్ అని, ఆయన రాజ్యాంగ రూపంలో సమాజంలోని అన్ని రుగ్మతలను రూపుమాపి, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పాలన లో భాగస్వామ్యం కల్పించి ప్రజా హక్కులను రూపొందించి ఇంకా సజీవంగా అందరి మనస్సులలో ఉన్నారని, ముఖ్యమంత్రి సీఎం జగన్ అంబెడ్కర్ స్ఫూర్తి తో రాష్ట్ర ప్రగతిలో ప్రభుత్వ పాలనలో అందరిని బాగస్వామ్యాలను చేస్తూ అందరికి గౌరవం పంచుతూ అభివృద్ధి లో కూడా ముందడుగు వేస్తున్నారని ప్రశంసించారు.
