సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీక మాసం కృత్తిక నక్షత్రం నేపథ్యంలో గత బుధవారం రాత్రి భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయం ఆవరణలో సాంప్రదాయ బద్దంగా వేసిన జ్వాలా తోరణం లో వేలాదిగా యువకులు, చిన్నారులు ఆనందోత్సవాలుతో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య గడ్డి తో ఏర్పాటు చేసిన తోరణం ను వెలిగించగానే క్షణాలలో భారీ మంటలు ఎగసి పడుతూ తోరణం ఏర్పడింది. పోలీసులు , స్థానిక దేవాలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ తోరణం మంటలు ఎగసి పడుతున్నప్పుడు దాని క్రింద నుండి ఎవరిని వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. భక్తులు యువకులు సెల్ఫీలు , వీడియోలు తీస్తూ జ్వాలా తోరణాన్ని ఆస్వాదించారు. భీమవరంలోని పలు శివాలయలలో జ్వాలా తోరణంలు ఏర్పాటు చెయ్యడం జరిగింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *