సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేయుచున్న మోక. అరుణ్ కుమార్ సాధారణ బదిలీలలో భాగంగా కాళ్ళకూరు. స్వయంభూః శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ కార్య నిర్వహణ అధికారిగా బదిలీ అయ్యారు. ఈయన హయాంలో గత 2 ఏళ్లుగా మహాశివరాత్రి , కార్తీక మాస వేడుకల నిర్వాహణ లోను భక్తుల కు దర్శన ఏర్పాట్లలో, నూతన వరవడి సృష్టించారు. గత ఏడాది కార్తీకమాసం, ఇటీవల జరిగిన మహాశివరాత్రి వేడుకలలో దేవాలయానికి భారీగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం, దర్శన టికెట్స్ ఆదాయం భారీగా పెరగటం గమనార్హం. ఇక కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆలయ ఈవోగా పనిచేయుచున్న చాగంటి .సురేష్ నాయుడు గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారి వారు నేటి బుధవారం ఉదయం ఆలయ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో భీమవరంలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఇఓ గా పనిచేసిన నేపథ్యంలో ఇక్కడివారికి సుపరిచితులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *