సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ గునుపూడి బ్రాహ్మణా అధ్వర్యంలో నేడు, మంగళవారం జనసేన టీడీపి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మరియు కొటికలపూడి గోవిందరావు సమక్షంలో పరిచయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక బ్రాహ్మణుల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. భేటీ లో బ్రాహ్మణ మహిళలు కూడా పాల్గొనడం విశేషం. ఈ సమావేశంలో అంజిబాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అందరూ ఈ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించుకొన్నారని భీమవరం నియోజకవర్గంలో .బ్రాహ్మణులు అందరూ టీడీపీ, జనసేన బీజేపీ కూటమి మద్దతు తో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. జనసేన చినబాబు మాట్లాడుతూ.. ఈసారి బ్రాహ్మణులందరూ ఏకమై అంజిబాబు గారిని గెలిపించాలని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బ్రాహ్మణ సమైక్య సంఘాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్ బ్రాహ్మణ సమాఖ్య సంఘ సభ్యులు వేలూరి బుజ్జి మరియు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొన్నారు
