సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి గ్రామదేవతలు శ్రీ ఆదిలక్ష్మి , రాజ్యలక్ష్మి, పోలేరమ్మ వారి’ దేవాలయం వద్ద ఉగాది’ జాతర మహోత్సవాలు లో భాగంగా ఏర్పాటు చేసిన పందిళ్ళలో ప్రతి రోజు విశేషముగా భక్తులచే కుంకుమ అర్చనలు, ప్రసాద వితరణలు జరుగుతున్నాయి. గత నెల 28వ తేదీన ప్రారంభమయిన ఈ జాతర వేడుకలు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం ఉగాది పర్వదినం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా నేడు, సోమవారం ఆలయంలో అమావాస్య పూజ కార్యక్రమాలు కామన భాస్కర్ రావు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా వందలాది మంది భక్తులకు పంచభక్ష్య పరమానాలతో అన్నసమారాధన నిర్వహించారు. తదుపరి మహిళలకు కుంకుమ, గాజులు, రవిక ప్రసాద వితరణ జరిగింది.రేపు ఉగాది రోజు ఉదయం 5 గంటలా నుండి శ్రీ అమ్మవారికి భక్తులచే మొక్కుబడులు సమర్పణ, ,పంచ భక్ష్య పరమాన్నాలతో మహానివేదన చేస్తారు. తదుపరి సాంప్రదాయ ప్రదర్శనలు, నృత్యాలుతో అమ్మవారి గ్రామా ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని , దేవాలయ ధర్మకర్తల కమిటీ చైర్మెన్ ఏలూరి సాయి సత్యనారాయణ, గౌరవ చైర్మెన్ నల్లం వెంకట నాగేశ్వర రావు , కంచు స్తంభము రామారావు ఇతర సభ్యులు, ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *