సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని గ్రామా దేవతలుగా వందల ఏళ్లుగా ప్రసిద్ధి పొందిన శ్రీ శ్రీ శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ, అమ్మవార్ల 32 వ జాతర మహోత్సవం నకు గత రాత్రి శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు విచ్చేసి కళాకారులను నిర్వాహకులను అభినందించారు, ముందుగా శ్రీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు తదుపరి కళావేదిక వద్దకు వచ్చి గునుపూడి చెందిన తన సహచర మిత్రుడు , రాజకీయ నేత, దాత స్వర్గీయ నందమూరి తాతాజీ చిత్ర పటానికి నివాళ్లను అర్పించి తదుపరి వేడుకలలో పాల్గొంటున్న కళాకారులను అభినందించారు. ఎంతో ఘనంగా గత 31ఏళ్లుగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి దాతలు, శ్రీ అమ్మవారి భక్తుల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ప్రదర్శనలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న జాతర నిర్వాహకులను అభినందించారు. శ్రీ శ్రీ శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ, అమ్మవార్ల దయ అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
