సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టాన సమీపంలోని గొల్లలకోడేరు గ్రామా సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బొక్కా జయశ్రీని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సస్పెండ్ చేసినట్లు ఎం పీడీవో నూకల మురళీగంగాధర్ రావు తాజగా ప్రకటించారు. గొల్లల కోడేరు గ్రామానికి చెందిన వృద్ధుడు దర్భా శివలిం గమూర్తి పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొద్ది రోజుల తరువాత పింఛను ఆమోదంపై జరుగుతున్నా ఆలస్యం పై కుటుంబ సభ్యు లు అడగటంతో జయశ్రీ చాల దురుసుగా సమాధానమిచ్చారు. దాంతో వారు స్పందన కార్యక్రమం లో ఫిర్యా దు చేయగా, విచారణలో అది నిజమేనని జయశ్రీ దురుసుగా సమాధానాలు చెపుతున్నారని నిర్ధారణకు వచ్చి జిల్లా కలెక్టర్ జయశ్రీని సస్పెం డ్ చేస్తూ ఉత్తర్వులు
జారీ చేసారు.
