సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జిల్లాలో ప్రతిష్టాకర భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ అడ్జక్ష పదవి కి ప్రముఖ వ్యాపారవేత్త సభాపతి రాజీనామా చెయ్యడం తో నేడు, బుధవారం స్థానిక ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో నూతన అధ్యక్షునిగా బొండాడ రామపండు ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తదుపరి ఆయన స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు లను మర్యాద పూర్వకంగా కలసి ఛాంబర్ తరపున ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు నూతనంగా ఎన్నికైన, ప్రముఖ సీనియర్ వ్యాపారవేత్త, రామపండు ను అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. 1928లో ఛాంబర్ ఏర్పడిందని జిల్లాలోనే ఆర్ధికంగా బలమైన భీమవరం పట్టణం లో ఛాంబర్ పదవి కీలకమైనదని.. మరి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని దానిని గుర్తు పెట్టుకొని రామపండు గారు వ్యాపార వర్గాలను సభ్యులందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని అన్నారు.
