సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం,చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ సౌజన్యంతో భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యూనిఫామ్ లు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు పులఖండం కోటేశ్వరరావు, కాగిత వెంకటరమణలు మాట్లాడుతూ.. సమయపాలన లేకుండా సంవత్సరంలో 365 రోజులు విధులకు అందుబాటులో ఉంటూ, ప్రజా రక్షణలో ఉండే శాఖ పోలీస్ శాఖ అని, వారి సేవలను గుర్తించి, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది 42 మందికి యూనిఫామ్ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీ చరణ్ అనుమతితో అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా సి.ఐ. కాళీ చరణ్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాల ప్రోత్సాహం మాకు మరింత ఉత్సాహాన్నిస్తుందని, ఛాంబర్ సంస్థ సభ్యులకు స్టేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి శివ, వబిలి శెట్టి వెంకటేశ్వరరావు, సంగడి బుజ్జి,కురిశెట్టి కుమార్ బాబు,R.V. ప్రసాద్, సుంకర కేశవ్, ఎ.స్సై. రామారావు,సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు
