సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం చిన అమిరంలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు బయట పడింది. నిజానికి మసాజ్ సెంటర్స్, స్పా సెంటర్ల ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహించడంలో భీమవరం పరిసర ప్రాంతాలలో కొందరు ఆరితేరి లక్షల సంపాదనలో ఆరితేరారు. తాజా ఘటనలో వివరాలు చుస్తే.. భీమవరమండలం చిన అమిరం గ్రామంలోని తమ్మిరాజు నగర్ రెండో వీధిలో లావిష్ పేరిట బ్యూటీ, సెలూన్, బ్రెయిడల్ స్టూడియో స్పా ముసుగులో కొన్నాళ్లుగా వ్యభిచారం జరుగుతున్న విషయం 2 టౌన్ పోలీసులు రట్టు చేశారు. చినమీరం లోని లావిష్ బ్యూటీ అండ్ స్పా భాగోతాన్ని భీమవరం రెండో పట్టణం సీఐ బి. కృష్ణకుమార్ నేడు, బుధవారం మీడియా కు తెలిపిన వివరాలు ప్రకారం .. ..జిల్లా ఎస్సీ యు. రవిప్రకాష్ ఆదేశాలపై భీమవరం, నరసాపురం డీఎస్పీలు బి. శ్రీనాథ్, వీరాంజనేయరెడ్డి సంయుక్త ఆధ్వర్యాన సీఐ బి.కృష్ణకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆకుల రఘులకు అందిన సమాచారంతో ఎస్సైలు పి.అప్పారావు, వి.రాంబాబు తమ సిబ్బందితో కలిసి గత మంగళవారం అర్ధరాత్రి లావిష్ బ్యూటీ అండ్ స్పాపై దాడులు చేశామని అక్కడ మహిళల ద్వారా వ్యభిచారం చేయిస్తున్న, స్పా నిర్వాహకుడు ఇంగువ శివ సురేష్, (భీమవరం,కొవ్వాడ పుంత), సత్యదేవ్ (నరసాపురం), ప్రతాప్ (విశాఖపట్టణం), మాంధతి మాధవ్ (విజయవాడ), గడ్డం వినోద్ కుమార్ (హైదరాబాద్) అనే వ్యక్తులు ఈ వ్యభిచార దందా నడుపుతున్నారని తమ దర్యాప్తు లో తేలిందన్నారు, .ఈ దాడుల్లో వ్యభిచారం కోసం తీసుకొచ్చిన నలుగురు మహిళలను నిందితుల బారి నుంచి పోలీసులు రక్షించారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు ఇంగువ శివసురేష్, ఉద్యోగులు మాధవ్, వినోద్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో నిందితుల నుంచి 10 మొబైల్ ,రూ.96,130 నగదు, 20 కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *