సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్నమిరంలో టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పై అవగాహన సదస్సు కార్యక్రమంలో శాసనసభడిప్యూటీ స్పీకర్, కనుమూరి రఘురామ కృష్ణంరాజు తనయుడు కనుమూరి భారత్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. జిల్లా టీడీపీ అడ్జక్షులు , APIIC చైర్మన్ మంతెన రామరాజు అడ్జక్షతన జరిగిన సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారిని సభకు పరిచయం చేసి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన విజయానికి కార్యకర్తలు అందరు విస్తృతంగా కృషి చెయ్యాలని పిలుపు నిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవి రావు ఉండి నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ జిత్తుగ నాగరాజు మరియు నియోజవర్గ స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
