సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన బొంతు కిషోర్‌ కుమార్‌ (32), అతని భార్య యోచన, రెండేళ్ల కుమార్తె నిధిశ్రీ చించినాడ బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకారని భావిస్తున్నారు. భర్త మృత దేహం మాత్రమే లభ్యమైనట్టు భార్య కుమార్తె ఆచూకీ కోసం నేడు, శుక్రవారం ఉదయం కూడా గాలింపు చర్యలు చెప్పటినట్లు ఎస్‌ఐ కె.శివన్నా రాయణ తెలిపారు. భీమవరం లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కిషోర్‌ కుమార్‌ ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతకాలంగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో కొద్దిరోజులుగా నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కిషోర్‌ సోదరుడు ఉదయ కిరణ్‌ అతనికి ఫోన్‌ చేయగా ఎవరో ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ఈ మొబైల్‌ చించి నాడ బ్రిడ్జిపై ఉందని, దీంతోపాటూ బ్యాగ్‌, చెప్పులు ఉన్నాయని చెప్పారు. కిషోర్‌ కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు గత గురువారం గోదావరిలో గాలించగా సాయంత్రం కిషోర్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. అతని భార్య, కుమార్తెల ఆచూకీ లభ్యం కాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *