సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం రెస్ట్ హౌస్ లోని భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనములో జరిగిన “చాంబర్ జనరల్ బాడీ సమావేశంలో” రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గ్రంధి శ్రీనివాస్ మరియు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గా పోటీచేస్తున్న గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మీరంతా భీమవరం అభివృద్ధి లోసుమారు గత 5 ఏళ్లుగా నాతో చెయ్యి చెయ్యి కలపి నడిచారు. మీ సహకారంతో జిల్లా కేంద్రంగా భీమవరం ను సాధించుకొని పట్టణంలో కొత్త అందాలు తీసుకొనివచ్చి గతంలో ఎప్పుడు లేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం..100 కోట్లరూ పైగా ప్రభుత్వ నిదులల్తో ఖర్చుతో కొత్త రోడ్డులు ఏర్పాటు చేసుకున్నాం, కేంద్ర నిధులతో అమృత మంచినీటి కి లోటు లేకుండా రిజర్వాయర్లు రైల్వే టర్నల్స్ నిర్మించి ట్రాఫిక్ ని క్రమబద్దీకరించాం.. మీ సహకారం మరోసారి కోరుకొంటున్నాము. వ్యాపారస్తులు వారి కుటుంబ సభ్యులు వైసీపీ కి మరోసారి అండగా నిలబడండి, అసెంబ్లీ , లోక్ సభ ఓట్లను ఫ్యాను గుర్తుకే వెయ్యాలని కోరారు. ఉమాబాల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కిందని మీ ఓట్లు వేసి తమ ఇద్దరినీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏవిఆర్ సభాపతి, కార్యదర్శులు ఆర్.వి ప్రసాద్, కాగిత రమణ మరియుఇతర సభ్యులు యువ నేత గ్రంధి రవితేజ పాల్గొన్నారు.
