సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ లో నేడు, గురువారం పట్టణంలోని అన్ని కులాలు మతాలకు చెందిన స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో స్వర్గీయ గ్రంధి వేంకటేశ్వర రావు కు సంతాప సభ నిర్వహించారు. రాజకీయ చాణక్యుడుగా, పురపాలక సంఘ ప్రథమ పౌరుడిగా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి గ్రంధి వెంకటేశ్వరరావు అని, ఆయన మరణం తీరని లోటని త్యాగరాజ భక్త సభ నిర్వాహకులు చెరుకువాడ వెంకట్రామయ్య అన్నారు. అందరు గ్రంధి వేంకటేశ్వర రావుచిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రతిష్టకు వర్తక సంఘాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఏ పదవి చేసిన ఆ పదవికి న్యాయం చేసిన కార్య దీక్ష పరులు గ్రంధి వెంకటేశ్వరరావు అని నివాళులర్పిచారు. నిర్వాహకులు చెరుకువాడ రంగ సాయి మాట్లాడుతూ.. దాతగా ఎన్నో సేవలందించారని, ఆయన మరణం బాధాకరమని అన్నారు. తోట బోగయ్య, షేక్ రబ్బానీ, గంటా సుందర కుమార్, అల్లు రామకృష్ణ, నరహరి శెట్టి కృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, జవ్వాది దాశరథీ శ్రీనివాస్ ఎం సైమన్, గంట్ల కరుణాకర్, గెడ్డం జార్జి, ముస్లీమ్, క్రైస్తవ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *