సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం నియోజకవర్గం భీమవరం మండలం నాగిడి పాలెంకి గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు తీరుమాని ముత్యాలరాజు, TDP నుండి నాగిడి హరికృష్ణ, ఆధ్వర్యం లో ఆయా పార్టీల నుండి 30 మంది తమ జనసేన లో చేరినట్లు జనసేన జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు ప్రకటించారు. వారికీ ఆయన జనసేన పార్టీ శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొటికలపూడి గోవిందరావు ( చినబాబు) మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలం పుంజుకుని రాబోయే ఎన్నికలలో సత్తా చాటుతుందని తెలియజేశారు. ముందు ముందు జనసేన లో చేరికలు ఇంకా ఉంటాయని అయన తెలియజేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి , భీమవరం పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్ , భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీను గారు, భీమవరం పట్టణ సెక్రటరీ సుంకర రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంపీటీసీలు తాతపూడి రాంబాబు, ఆరేటి వాసు తదితర నేతల తో పాటు ,జనశైనికులు పాల్గొన్నారు.
