సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారులోని పంక్షన్ హాలులో జనసేన నేతలతో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గతానికి బిన్నంగా ఒక లయబద్దంగా మాట్లాడుతూ.. మన జనసేన ఎన్ని ఇబ్బందులు ఎదురయిన గత 10 ఏళ్లుగా ప్రజా బలంలో రాజకీయాలను శాసిస్తుందని అన్నారు. నేను భీమవరంలో గాజువాకలో ఓడిపోయాను, గెలిచిన ఒక్కడు పారిపోయాడు.. నన్ను రండి.. ఇరగదీసేద్దాం అంటూ రెచ్చగొట్టి భీమవరం తీసికొనివచ్చి పోటీ చేయించిన వారు ఇప్పుడు మన పార్టీలో లేరు.. అయినా సరే నేను ఇక్కడే ఉండిపోయాను. ఈ రోజు ఈ ఓడిన పార్టీ కష్టాలలో ఉన్న టీడీపీ కి చేయూత అందించే స్థానంలో ఉంది.. ఈ జిల్లాలో కూటమి గెలుస్తుందని బెట్టింగులు వేస్తున్నారు. అది జనసేన సత్తా.. మనం లేకపోతె అసలు ఇక్కడ రాజకీయాలతో పని ఏముంది? అని జనసేన బలాన్ని చెబుతూ నేతలను ఉత్సహపరిచారు. సీఎం జగన్ బిసి లకు బాగానే ప్రాధాన్యం ఇస్తున్నాడు కానీ ఆ పదవులకు అధికారాలు ఎమి ఇవ్వడం లేదు. జగన్ సమాజాన్ని విడదీసే విష సంస్కృతిని కుటుంబాలకి కూడా వ్యాపించేలా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రచారంలో ఉన్న వాస్తవాలు మాట్లాడుకొంటే.. భీమవరంలో రాజులకు కాపులకు పడదు.. తూర్పుగోదావరి లో కాపులకు చెట్టుబజ్జిలకు పడదు.. వీరందరిని కలిపే ప్రయత్నం తాను ఒక సినిమా హీరో క్రేజ్ తో అన్ని కులాలలో ఉన్న నా అభిమానుల సహకారంతో చేపట్టానని తెలిపారు. సీఎం జగన్ అయితే సొంత చెల్లికి ఆస్థిలో సమాన వాటా ఇవ్వకుండా న్యాయం చేయని వ్యక్తి ప్రజలకేం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి లో బీజేపీ ని కూడా చేరుస్తానని దీనివల్ల తనకేమి ఒరగదని అయితే ఏపీ ని అప్పుల పాలు కాకుండా రక్షించడానికి పనిచేస్తానని ఈసారి ఎన్నికలలో మన కూటమిదే విజయం.. ఈసారి డబ్బు లేకుండా రాజకీయాలు చెయ్యలేము అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొసమెరుపు ఏమిటంటే.. వేదికపై కొటికలపూడి చినబాబు మరియు కనకరాజు సూరి లకు మాత్రమే ( కాపు, రాజుల సామజిక వర్గాలు ) పవన్ తో సీట్లు కేటాయించారు. ఒక బిసి మైనారిటీ నేతలకు కూడా వేదికపై సీటు కేటాయించి ఉంటె బాగుండేది..
