సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం లోని ఇటీవల వీరవాసరం జడ్పీ టిసి గా జనసేన పార్టీ తరపున సంచలన విజయం నమోదు చేసిన గుండా జయప్రకాష్ నాయుడు ఫై తాజగా తెలంగాణ పోలీసులు తాజాగా ఫోర్జరీ కేసు, కేసు నమోదు చేసారు అని తాజా వార్త సమాచారం. భీమవరం ప్రాంత జనసేన నేతలలో కీలక నేతగా గుర్తింపు పొందిన జయప్రకాష్ నాయుడు ఫై ఇటువంటి ఆరోపణలు రావడం సంచలం రేపింది. వివరాలలోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో మత్యసంపద అభివృద్ధికి అక్కడ 32 జిల్లాలోని చెరువులలో వెయ్యడానికి చేప, రొయ్య పిల్లల కోసం అక్కడి మత్య శాఖ 113 కోట్ల తో టెండర్లను ఆహ్వానించింది. అయితే అక్కడ 12 జిల్లాలో చెరువులకు మారుపేర్లతో టెండర్లు వేసి , ఫేక్ అధికారుల సంతకాలతో, బ్యాంకు గ్యారంటీ లు చూపి వాటి టెండర్లను జయప్రకాష్ నాయుడు దక్కించుకొన్నారని కొందరు పిర్యాదు చేసారు. దానితో తెలంగాణ అధికారులు దర్యాప్తు చేసి ఆ ఫిర్యాదులలో వాస్తవాలు ఉన్నాయని తేల్చడంతో ఆయనపై ఫోర్జరీ, క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని తాజా వార్త సమాచారం. తనపై వచ్చిన ఆరోపణలపై జయప్రకాష్ నాయుడు ఇంకా వివరణ ఇవ్వవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *