సిగ్మాతెలుగు డాట్ , ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం, జిల్లా కలెక్టరేట్ లో Dr BR అంబేద్కర్ గారి 132 వ జయంతి వేడుకలు నేటి, శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి తో పాటు, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని Dr BR అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దళితులకు మాత్రమే నాయకుడు కాదని మొత్తం భారతీయులందరి సంక్షేమం కోసం ఆయన శ్రమించారని అన్నారు మహిళా హక్కులు, ప్రాధమిక హక్కులు, మత స్వేచ్ఛ, వంటి ఎన్నో గొప్ప విషయాలను రాజ్యాంగం లో పొందుపర్చి ప్రజాస్వామ్యం పటిష్టoగా ఉండేందుకు కృషి చేశారని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో సీఎం జగన్, అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో MBC చైర్మన్ పెండ్ర. వీరన్న, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రవికుమార్, ASP, RDO, మరియు ఇతర జిల్లా అధికారులు పట్టణ ప్రముఖులు, పాల్గొన్నారు. స్థానిక స్కూలు విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను అలరించాయి.
