సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మాములు రోజుల కన్నా సంక్రాంతి రోజులలో అంటే దాదాపు కొత్త ఏడాది ప్రారంభం నుండి భీమవరం ఆకివీడు పరిసరాలలో రొయ్య ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఎగుమతులు తగ్గినా సరే అతిధుల కోసం రొయ్యలు కావాలి. అందుకే లోకల్ డిమాండ్ బాగా పెరిగిన నేపథ్యంలో దీంతో వ్యాపారులు ధరలను పెంచుకుంటూ వెళ్ళారు. 30- 40 కౌంట్ ధరలు భారీగా పెంచేసినప్పటికీ 400 – 500 మధ్య భారీగా పెంచేశారు. ఇక చిన్నసైజు 100 కౌంటు రొయ్యలు రూ. 200 నుంచి రూ. 270 వరకు తీసుకెళ్ళారు. దీనితో ఎంతో మంది ఆక్వా రైతులకు పరిస్థితి మెరుగయి భారీ లాభాలు వచ్చాయి అని సంతోషించే లోపే సంక్రాంతి పండుగ కు అకస్మాత్తుగా చిన్న సైజు రొయ్యకు డిమాండ్ లేకపోవడంతో అకస్మాత్తుగా 100 కౌంట్ ధరలు మరల పడిపోయాయి. ప్రస్తుతం 230- 250 రూపాయలకు అందుబాటులోకి వచ్చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *