సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆక్వా పంటలకు ఎగుమతులకు రాజధాని భీమవరం జోన్ లో ఇటీవల మరోసారి గత 6వారాలుగా రొయ్య ల ధరలు మెల్లగా పడిపోతూ వస్తుండటంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. 2నెలల క్రితం వరకు100 కౌంట్ చిన్న రొయ్యలు కిలోరూ.250 ధర పలికి రైతుకు లాభాలతో గట్టెకించిన రొయ్య ధర గత 2 రోజులుగా 100 కౌంట్ కిలో కు 200 రూపాయల ధర పలకడం గగనమైపోతుంది. ఇదే తరహాలో కాస్త పెద్ద రొయ్యలు 70, 60, 50 కౌంట్ రొయ్య ల ధరలు 250కి కాస్త అటుఇటు పలుకుతున్నాయి. అయితే ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుండి రొయ్య ల ఎగుమతులు భారీగా జరుగుతున్నాయని సమాచారం…. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా ఉత్త్పతులపై వాటి ఎగుమతి కు ధరలు నిర్ధేసించి నప్పటికీ ఇటీవల మెతలు , నాణ్యమైన సీడ్, 3 ఎకరాల లోపు చెరువుల లీజ్ చేసేవారికి నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో రొయ్యలు పండిస్తున్న చిన్న స్థాయి ఆక్వా రైతులకు గతంలో లాగా లాభాలు రావడం లేదని వాపోతున్నారు. రొయ్యలకు ఆర్డర్లు లేవని, గతంలో పంపిన సరుకు కు ఇంకా డబ్బులు రాలేదని , రైతులకు మాత్రం సరుకు తీసుకోగానే డబ్బు ఇవ్వాలని , కోల్డ్ స్టోరేజ్ లలో భారీగా రొయ్యల నిల్వ లు ఉన్నాయని రొయ్య ఎగుమతి దారులు చెబుతున్నా రని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా..కమిటీ రైతులకు కొనుగోలు దారులకు మధ్య సమన్వయము చేయ్యాలని రొయ్య రైతులు కోరుతున్నారు.
