సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయమని, దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిన గొప్ప సంఘ సంస్కర్త అని భీమవరంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి అన్నారు. నేడు శుక్రవారం భీమవరం టిడిపి కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి సీఎం చంద్రబాబు ఆదేశాలతో భీమవరం ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం వాటి పరిష్కారం కోసం అడుగులు వేసేందుకు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని చేపట్టామని ఆమె అన్నారు. భీమవరం నియోజక వర్గ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. 23 అర్జీలను స్వీకరించామని తెలిపారు. ప్రజల నుంచి అందించిన వివిధ సమస్యలపై స్పందించి ప్రభుత్వ దృష్టికి దృష్టికి తీసుకుని వెళ్తామని ప్రతి ఒక్కరి సమస్యల పరిష్కారానికి భరోసా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, పామర్తి వెంకట్రామయ్య, వేండ్ర శ్రీనివాస్, మెరగాని నారాయణమ్మ, టిడిపి పట్టణ అద్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మండల అధ్యక్ష, కార్యదర్శులు గణపతి, సీతారామ్, కోళ్ల నాగబాబు, వీరవల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *