సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పిఎస్ఎం బాలికొన్నత పాఠశాలలో 200 మంది పదో తరగతి విద్యార్థులకు టిడిపి తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో స్టడీ మెటీరియల్స్ ను అందించారు. టీడీపీ భీమవరం ఇంచార్జి, తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు 10 జీపీఏ లక్షంతో చదవాలని, ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు టిడిపి రాష్ట్ర కోశాధికారి, మెంటే పార్ధసారధి, మాట్లాడుతూ..విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, చదువుతో గౌరవం, విలువ లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, మెఱగాని నారాయణమ్మ కోళ్ల నాగేశ్వరరావు,గంటా త్రిమూర్తులు, రామలింగరాజు, మద్దుల రాము, మైలబత్తుల ఐజాక్ బాబు తదితరులు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పల్లివాడ సాయి ప్రసాద్ ఇతర స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *