సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ల సమావేశ అనంతరం నేడు, గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా త్రిమూర్తులుతో పాటు.వీరవాసరం భీమవరం మండలాలు భీమవరం పట్టణ అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్,కొయ్యలగడ్డ గణపతి, మద్దుల రాము కార్పొరేషన్ డైరెక్టర్లు,పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్,మరియు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, తదితరులు వేరువేరుగా మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని వార్తాపత్రికలు యూట్యూబ్ టీవీ చానల్స్ లలో భీమవరం నియోజవర్గ తెలుగుదేశంపార్టీలో వర్గవిభేదాలు తీవ్ర ఇబ్బందులు కుమ్ములాటలు ఉన్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని, ఆరోపణలను ఖండిస్తున్నామని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో టిడిపి బలోపేతమైందని , గతంలో సీతారామలక్ష్మి వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడిపి కార్యకర్తలను నాయకులను పార్టీని పట్టించుకోలేదని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, అన్నారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మా గురువువర్యులు మెంటే పార్థసారధితో మాలో కొందరికి విభేదాలు సృష్టించే అసత్య కథనాలతో వార్తలు ఇవ్వడం సరికాదన్నారు. గతంలో లోకేష్ యువగళం పాదయాత్రను సమర్థవంతంగా నిర్వహించి ఆనాటి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో మా అందరితో పాటు ఏ-1 ముద్దాయిగా ఉన్నారని సీతారామలక్ష్మిపై రెండు టీవీ చానల్స్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇలానే తప్పుడు కధనాలు కొనసాగిస్తే పరువునష్టం దావా కూడా వేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *