సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో ఇటీవల రోడ్ల ప్రక్క ఆక్రమణలు తొలగింపులో భాగంగా.. స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద చాలా కాలం నుండి ఆక్రమణ చేసి సదరు స్థలము నందు భీమవరం టెంపో వ్యాన్ అసోసియేషన్ షెడ్ ను నిర్మించుట జరిగినది. సదరు ఆక్రమణను తొలగించుకొనవలసినదిగా చాలా సార్లు సదరు సంస్థ వారికి అనేక సార్లు మున్సిపాలిటీ కార్యాలయము నుండి నోటీసులు జారీచేసినను సదరు ఆక్రమణను సంస్థ వారు తొలగించుకోనందున, మరియు ప్రభుత్వము వారి ఉత్తర్వులు కోర్ట్ వారి నిభందన ప్రకారం మురుగు కాలువ గట్లపై ఏ విధమైన అనధికారిక నిర్మాణములు తొలగించవలసినదిగా ఆదేశించినందున నేడు, బుధవారం ది.31-12-2025 వ తేదీన పోలీసు వారి బందోబస్తు తో సదరు ఆక్రమణ భీమవరం టెంపో వ్యాన్ అసోసియేషన్ షెడ్ ను తొలగించి సదరు స్థలమును పురపాలక సంఘము వారు తిరిగి స్వాధీనం చేసుకొన్నారని మునిసిపల్ కమిషనర్ కే రామచంద్ర రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *