సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో నేడు, సోమవారం తెల్లవారు జామున టౌన్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ పరిధిలో 3 వేరువేరు చోట్ల ప్రమాదాలలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం తీవ్ర విషాదకరం, భయానకం నింపింది.. మృతులలో ఒకరు నేటి తెల్లవారు జామున వచ్చిన ట్రైన్ నుండి బ్యాగ్ లతో దిగుతూ రైల్వే స్టేషన్లో జారిపడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భావిస్తున్నారు. ఇక ఉండి రైల్ గేటు దగ్గర పట్టాలపై ఒక వ్యక్తి శరీరం 2భాగాలుగా కట్ అయ్యింది. ( ఆత్మహత్యగా చూడటానికి కనపడుతుంది.. కానీ అసలు వాస్తవం దర్యాప్తులో తెలుస్తుంది.) ఇక మెంటే వారి తోట అండర్ టర్నల్ పైన ఉన్న రైలు ట్రాక్ ఫై మరో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం.. రైల్వే ట్రాక్ లపై ఇలా ముగ్గురు మరణించడం ఆయా ప్రాంతాల స్థానికులతో ఆందోళన రేకెత్తించింది. దీనిపై టౌన్ రైల్వే పోలీసులు, 2 టౌన్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *