సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన కార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలసిన భీమవరం ముస్లీమ్ పెద్దలతో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీమవరం సున్ని జామియా మస్జిద్ ఫేస్ ఇమామ్ ఫైజీని ఖాజీగా ప్రభుత్వం నియమించడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ.. భీమవరం డివిజన్ ఖాజీగా నియమితులైన మొహమ్మద్ మొయిజి ఆలం ఫైజీకి ప్రభుత్వ నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భముగా ఫైజీ ఎమ్మెల్యే గ్రంధి ని ఆలింగనం చేసుకొని కృతజ్ఞలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ నాయకులు షేక్ రబ్బాని, షేక్ అన్సారీ, షేక్ ఇమామ్ మొహిద్దిన్, ఎండి అస్లాం పాషా, ఎస్డి బాజీ, ఎస్.కె ముజాహిద్, ఎండి నిజాముద్దీన్ ,ఎండి సలీం, ఎండి షంఘద్దీన్, ఎండి గౌస్ మొహిద్దిన్, సయ్యద్ బాజీ, అజీజుర్ రెహమాన్, ఎండి ఇబ్రహీం, ఎండి వజీర్, అబ్దుల్ తదితర నాయకులు పాల్గొన్నారు…
