సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం డి.ఎన్.ఆర్ కళాశాల రసాయనశాస్త్ర విభాగము ఆద్వర్యములో “పెట్రోలియం పరిశ్రమ – ఆధునిక విశ్లేషణ పద్దతులు” అనే అంశముపై గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ సమావేశములో ముఖ్య వక్త అయిన ఎస్. చిరంజీవులు విధ్యార్ధులకు ఉపయోగపడేలా అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మోజెస్ మాట్లాడుతూ .. ప్రకృతి వనరులను ఆదాచేసుకోవడం అత్యావశ్యం అన్నారు. పరిపాలనాధికారి రామకృష్ణంరాజు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఆర్ధికపరంగా ఎంతో ఖర్చు జరుగుతుందని, ఇది వాతావరణ కాలుష్యం , ప్రజలకు అనారోగ్యం కు దారితీస్తుందని విశేషించారు. విభాగ అధిపతి గజపతి రాజు మాట్లాడుతూ.. పెట్రోల్ బంకులో వినియోగదారులు ఏ విధంగా నష్టపోయేది ఉదహరించారు.ఎస్. చిరంజీవులు ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విధ్యార్ధులు పాల్గొన్నారు.
