సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సుడిగాలి పర్యటన చేశారు. నేడు, మంగళవారం జోరువానలో సముద్ర తీరా ప్రాంతాలైన భీమవరం మండలం కొత్త పూసలమర్రు, దొంగపిండి గ్రామంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు ఆదేశాలు సూచనలు అందించారు. గర్భిణీలను, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని సూచించారు. కొత్త పూసలమర్రు, దొంగపిండి గ్రామంలోని పునరావాస కేంద్రంలో ఉన్న 65 మందితో మాట్లాడారు. తుపాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం నూరు శాతం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మరో రెండు,మూడు రోజులపాటు వర్షాలు ఉన్నందున అవసరమైతే తప్ప బయట ప్రయాణాలు చేయవద్దని, ఇప్పటికే ఈ గ్రామాల్లోను రోడ్లు పూర్తిగా మునిగిపోయి ఉన్నాయని, వర్షాలు తగ్గుముఖం పెట్టేవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, ఎఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, పాల్గొన్నారు.
