సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం,ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం (త్యాగరాజు భవనం) లో ఆర్యవైశ్య యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈ దసరా వేడుకలను ఈనెల 12వ తేదీవరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ మాత వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి “నవరాత్రులు” లో భాగంగా ఈరోజు అమ్మవారు..-:లలితా త్రిపుర సుందరీ దేవి:- అలంకారంలో అత్యంత సుందరంగా కోరిన వరాలిచ్చే తల్లిగా దర్శనమిస్తున్నారు. అక్కడ ప్రత్యకంగా చేసిన దసరా సందడి ఏర్పాట్లను, అలంకరణలు వీక్షించడానికి విశేషంగా భక్తులు తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
