సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేటి మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఇటీవల .విజయవాడలో నిరాశ్రయులు అయిన లక్షన్నర మంది వరద బాధితులను ఆదుకునేందుకు భీమవరం నియోజకవర్గం నుంచి రూ 97,52,780 లు దాతలు చెక్కుల రూపంలో తనకు స్వయంగా కలసి విరాళంగా అందించారని, ఇది కాకుండా భీమవరం కు చెందిన విద్య సంస్థలు , స్వచ్చంద సంస్థలు కలెక్టర్ ద్వారా, డైరెక్ట్ సీఎం ను కలసి కోట్లాది రూపాయలు సహాయనిధి కి విరాళాలు అందజేశారని . అలాగే లక్షాలాది ఆహార పొట్లాల పంపిణి కూడా చేసారని . తాను దీపావళి పండుగ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహాయ నిది ని అందజేస్తామని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు.దాతలు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. భీమవరం – లొసరి, భీమవరం – పిప్పర రొడ్డుల అభివృద్ధికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సుమారు రూ 100 కోట్లు మంజూరు చేశారని, హైవే లకు అనుసంధానంగా ఈ రోడ్డులను అభివృద్ధి చేస్తున్నారని, వాటిని 4 వే రోడ్డులు మార్పు చెయ్యాలని భావిస్తున్నామని అన్నారు. భీమవరంలోని గునుపూడి, తాడేరు, చిన ఆమిరం, రాయలం, కొవ్వాడ అన్నవరం గ్రామంలో రిజిస్ట్రేషన్ వాల్యూ విపరీతంగా పెరిగాయని, వాటిలో రైతుల పొలాలు సర్వే చేసి వాటి అసలు రేట్లు వీటిని పూర్తిగా అధ్యయనం చేసి ఇవ్వాలని రిజిస్ట్రార్ కు చెప్పడం జరిగిందని, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని అన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించుకుందామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.
