సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం నుండి టీపీ గూడెం వైపు రోడ్ల విస్తరణలో భాగంగా విజయలక్ష్మి థియేటర్స్ ఎదురుగ దుర్గాపురం ప్రాంతం లో ఆక్రమణలను తొలగింపు పూర్తీ అయ్యింది, నేడు, మంగళవారం సుమారు 10 కి పైగా JCB పొక్రేన్లను ఉపయోగించి పోలీసులు,అధికారుల సమక్షంలో చాల సమన్వయంగా పని చేసి సంపూర్తిగా నేలమట్టం చేసారు, ఆ ప్రాంతాములో శిధిలాలను చదును చేసే కార్యక్రమం కూడా కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న బాధిత కుటుంబాల వారు తమ షాపులు ,ఇంటి సామాను , షెడ్లను ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలులో భాగంగా ఒక ఉద్విగ వాతావరణం నెలకొంది, గత నెలరోజులుగా ఆక్రమణలు కొద్దీ కొద్దిగా తొలగిస్తున్నప్పటికీ , నేడు, భారీస్థాయిలో నిర్మాణాలను నేలమట్టం చేసేయడంతో నిన్నటి వరకు స్థానికులతో సందడిగా ఉన్నఆ ప్రాంతం ఒక్కసారిగా పూర్తీ ఖాళీగా నిస్తేజంగా మారింది. ఇక ప్రభుత్వ అధికారులు శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు, రైల్వే అండర్ టర్నల్ కు ప్రధాన రోడ్డు కలుపుతూ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తీ చేస్తే వాహనదారులకు మేలుతో పాటు .. ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోవడం తో పాటు సుందర భీమవరం కు ఆప్రాంతం ఒక ఆకర్షణగా మారుతుంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *