సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, నరసాపురం నియోజకవర్గాలలోని తీరప్రాంతాలలో మత్య కారులకు చేపల వేటకు ఇక అడ్డంకులు లేవు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంవిధించిన రెండు నెలల నిషేధ కాలం గత శనివారంతో ముగిసింది దీంతో నేటి ఆదివారం తెల్లవారు జామునుండి స్థానిక మత్స్యకారులు (Fishermens) వేటకు బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం ముగియడంతో చేపల వేట సాగించడానికి మత్స్యకారులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. వలలు, బోట్లు, ఇంజన్లకు మరమ్మతులు పూర్తి చేసుకుని బోట్లకు రంగులు వేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *