సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం , నరసాపురం మండలం సముద్ర తీరంలో వచ్చే సోమవారం అర్ధరాత్రి నుంచి మత్యకారులు సుముద్ర వేట నిషేధ ఆజ్ఞలు అమల్లోకి రానున్నాయి. వచ్చే జూన్‌ 15 వరకు అంటే 60 రోజుల పాటు మత్య సంతానం పెరుగుదల కోసం ఈ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. మత్స్యశాఖ అధికారులు వేట సాగించే బోట్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసారు.. నిషేధం అమల్లోకి వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ గుర్తింపు పొందిన 1830 మంది మత్స్యకారులు కు రెండు నెలల పాటు నిషేధ కాలంలో ప్రభుత్వం నెలకు రూ.10 వేలు చొప్పున రెండు నెలల కాలానికి రూ.20 వేలు భృతి అందించనున్నారు.. మే, జూన్‌ నెలలో ఈ భృతి మొత్తం వారి ఖాతాల్లో జమ చేయ నున్నారు. జిల్లా వ్యాప్తంగా సముద్ర తీరం విస్తరించి ఉన్న 19 కిలోమీటర్ల పరధిలోనూ ఈ నిషేధ అజ్జలు అమలులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *