సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నర్సాపురం, భీమవరం మండలాలకు సమీపంలోని సముద్రంలో నీరు రంగు మారడం, గాలిదిశ మారడం , వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యకారులు తాత్కాలికంగా వేటకు కొంత కాలం విరామం ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంత సముద్రంలో వేటాడినా మత్స్య సంపద దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా సముద్రంలో వారం రోజులు ఉన్నా కనీసం మోటరోబోట్లకు ఆయిల్ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది మత్స్యకారులు బోట్లను కట్టేసి వేరే ప్రాంతాలకు పనులు చేసుకోవడానికి కొద్దీ రోజులు వలస వెళ్ళుతున్నారు. నరసాపురం , భీమవరం మండల గ్రామాలలోని మత్యకారులు సముద్ర తీరంలో సుమారు 400 బోట్లు పైగా ప్రతిరోజు వేట సాగిస్తూఉంటారు.ఈ తీరప్రాంతంలో ఎంతో విలువైన మార్కెట్‌లో ఎగుమతులకు డిమాండ్ ఉన్న సముద్ర రొయ్య, పండుగొప్ప, టేకు చేపలు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. స్థానిక బోట్లే కాకుండా ఇతర కోస్తా, జిల్లాల నుంచి కూడా ఇక్కడ వేటాడేందుకు మత్యకారులు బోట్లలో, స్టీమర్స్లో వస్తుంటారు. అయితే ప్రస్తుతం మంచి సీజన్ అయినప్పటికీ సముద్రంలోమత్యకారులు వేటకు విరామం ప్రకటించారు.
