సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మండలం తీరప్రాంతం , నరసాపురం తీరా ప్రాంతాలలో నేటి మంగళవారం నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.సముద్ర తీరప్రాంతంలో ఉండే మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే బోట్లు స్వాధీనం చేసుకోవటంతో పాటు వారి వద్ద నుంచి పట్టిన చేపలు స్వాధీనం చేసుకుంటారు. నిషేధం అమలు చేసేందుకు మత్స్య శాఖతో పాటు కోస్ట్ గార్డ్, నేవీ, రెవిన్యూ అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెడతారు.పశ్చిమ గోదావరి జిల్లాలోసుమారు 20 కిలో మీటర్ల సముద్రతీరం ఉంది. మొత్తం తీరప్రాంతంలో ఉన్న 12 గ్రామాల్లో అధికారిక లెక్కల ప్రకారం 38,652 మంది జనాభా ఉంటే వీరిలో 9,558 మంది వేటకు ప్రతి రోజు వెళతారు. వీరిలో సముద్రంలోకి వేటకు వెళ్లే వారు 1814 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా మొత్తం జిల్లా లో 145 మోటరైజ్డ్ బోట్లు, 312 నాన్ మోటరైజ్డ్ బోట్లతో పాటు ఒక మెకనైజ్డ్ బోటు ఉంది. ఇక వీటికి విశ్రాంతి . వేట నిషేధం అమలులో ఉన్న సమయంలో మత్య కారులకు గత ప్రభుత్వం రూ.10వేలు ఇస్తే కూటమి ప్రభుత్వం రూ.20వేలు భృతి కింద సహాయం చేస్తానని హామీ ఇవ్వడం తో మత్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు
