సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నాగరాజు కార్తీక్ నకిలీ ఐపీఎస్ అధికారిగా అందరినో బురిడీ కొట్టించి ఏకంగా పోలీస్ విచారణ పేరుతొ ఫేక్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎందరినో అమాయకులను చిత్రహింసలు పాలు చేసి వాటిని వీడియోలుగా తీసి, ఎన్నో సెటిల్మెంట్స్ లో లక్షలాది సొమ్ము దోచుకొన్న ఘరానా మోసగాడి ఉదంతం మీడియా చేనెల్స్ లో ప్రసారమౌత తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. ఇంతకీ ఈ నకిలీ ఐపీఎస్ అధికారి, ఆర్మీ కల్నల్, మేజర్ మూలాలు.. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పరిసర ప్రాంతాలలో ఉండటం గమనార్హం. భీమవరం సమీపంలో 15 కిలోమీటర్లు దూరంలో శివదేవుని చిక్కాల గ్రామానికి చెందిన నాగరాజు రఘువర్మ అలియస్ కార్తీక్ (25) భీమవరం లో డిగ్రీ వరకు చదివాడు. చిన్నప్పటి నుంచి పోలీసు అధికారి కావాలని కలలు కన్నాడు. కానిస్టేబుల్,ఎస్ఐ పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడి.. తేలికగా డబ్బు సంపాదించేందుకు నాగరాజు 2016లో హైదరాబాద్ కు వచ్చి .. 2018వరకు పలు చోట్లా కారులు దొంగిలించాడు. తరువాత అంతర్రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అంటూ దానికి కావలసిన వాహనం , రివాల్వర్, సంకెళ్లు అన్ని సమకూర్చుకొని పలువురిని వేధిస్తూ, ప్రముఖులను పరిచయం చేసుకొని లక్షలాది రూపాయలు అయాచితంగా సంపాదిస్తున్న నేపథ్యంలో ఈ ఘరానా మోసగాడి ఫై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రియల్టర్ మహేష్ అతని సోదరుడు కలసి పిర్యాదు చేసిన నేపథ్యంలో ఈనెల 21న సైబరాబాద్, మాదాపూర్ పోలీసులు నిఘా వేసి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఓ నాటు తుపాకీ, 9 రౌండ్ల బుల్లెట్లతోపాటు నకిలీ గుర్తింపు కార్డులు స్వా ధీనం చేసుకున్నారు. అతన్ని పోలీసులు విచారించగా నకిలీ పోలీసు అధికారిగా అతను చేసిన దోపీడీలు, దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022లో ఏలూరు జిల్లాకు చెందిన మేకపాటి రవిశంకర్‌ను కిడ్నాప్ చేసి అతని వద్ద రూ.2 లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
