సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ల్ : భీమవరం నాచువారి సెంటర్ లోని శ్రీపంచముఖ ఆంజనేయ స్వామివారి 9వ వార్షిక మహోత్సవాన్ని నేడు, బుధవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రారంభించారు. మంగళవారం మహనీయుడు 5 వారాల దేవుడు మన పంచముఖ హనుమంతుడు అని, కోరిన కోర్కెలు తీర్చే భగవంతుడు అని అన్నారు. 7 రోజులపాటు స్వామివారి వార్షిక మహోత్సవాన్ని,9 ఏళ్ళ పాటు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. నిర్వాహకులు ,డాక్టర్. గోవింద బాబు, ఉప్పలపాటి ప్రభాకర్ రావు, సుంకర్ దాసు తదితరులు మాట్లాడుతూ.. ఉత్సవాలు నేపథ్యంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు, సాయంత్రం నుండి వినోద సాంసృతిక నృత్య ముఖ్యంగా ఈనెల 28న ఉదయం నుండి ఉచిత మెడికల్ క్యాంపు, 30వ తేదీ వరకు స్వామివారి వార్షిక మహోత్సవాలు జరుగుతాయని, 30న ఉద్యమ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
