సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నాచువారి సెంటర్ లో శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి షహ్యబ్ది పవిత్ర వార్షికోత్సవాలు ఈనెల 24వ తేదీన ప్రారంభమయి ఈ నెల 30వ తేదీవరకు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం 6గంటల నుండి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రైజ్ మని కి డాన్స్ పోటీలు, మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నారు. డాక్టర్ గోవిందబాబు, డాక్టర్ అనురాధ దంపతుల నేతృత్వంలో పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు స్థానిక భక్తుల దాతల సహకారంతో అఖండ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *