సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని నాచువారి సెంటర్ సమీపంలో కుమ్మర్ల పెద్ద వీధి లో 103 ఏళ్లుగా స్థానికులచే పూజలు అందుకొంటున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాన్ని పునరుద్హరిస్తూ అదే స్థానే మరింత విశాలంగా రాతితో నూతన నిర్మాణం చెప్పట్టడానికి సంకల్పం చేసినట్లు దీనికి ఈ జేష్ఠ మాసం లోనే వేదపండితులచే ప్రత్యేక పూజలు చేసి ఆలయ పునరుద్దురణ పనులు ప్రారంభించినట్లు స్థానిక కొమ్మిన మునీశ్వరా రావు సోదరులు,కమర్షియల్ టాక్స్ అధికారి రాజశేఖర్ తదితరులు దేవాలయంలో పూజ కార్యక్రమ నేపథ్యంలో మన సిగ్మా న్యూస్ కు తెలియజేసారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి భక్తులు ఎందరో ఇప్పటికే ముందుకు వస్తున్నారని కావున స్థానికుల అందరి సహకారం కోరుకొంటున్నామని వాస్తు రీత్యా పురాతన దేవాలయం కన్నా రోడ్డు ఎత్తు పెరిగిపోయిన నేపథ్యంలో పునర్ నిర్మాణం ఆవశ్యకత స్థానికుల అభివృద్ధి కి కీలకమని ఆగమ శాస్త్ర పండితులు పేర్కొన్నారని వివరించారు.
