సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలను ప్రజలను ప్రభావితం చెయ్యడంలో స్థానబలం కలిగిన భీమవరం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ని మరో సారి బలోపేతం చెయ్యడానికి నరసాపురం పార్లమెంటరి టీడీపీ పార్టీ ఇంచార్జి,మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి , ఆర్ టిసి రీజనల్ మాజీ చైర్మెన్, మెంటే పార్ధసారధి, తదితర అగ్రనేతలు ఆధ్వర్యంలో, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ..గౌరవ సభ .. లను రురల్ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దీనిలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ వేదికను నిర్వహిస్తూ .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు , స్థానిక అధికారుల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను తెలపాలని వాటి పరిష్కారం కోసం తమ పోరాటం ఉంటుందని పేర్కొంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నేడు, మంగళవారం, వీరవాసరం మండలం మాత్యపురిలో తోట సీతారామ లక్ష్మి,మెంటే పార్ధసారధి, మామిడి శెట్టి ప్రసాద్, వేండ్ర శ్రీనివాస్ తదితర స్థానిక నేతలు, టీడీపీ క్యాడర్ సహకారం తో గౌరవ సభలు తో పాటు పలు ప్రాంతాలలో ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఇంటింటా తిరుగుతూ స్థానికులను పలకరిస్తూ వారికీ టీడీపీ గౌరవ సభ కర్రపత్రాలు స్వయంగా పంచుతూ .. టీడీపీ క్యాడర్ లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ( ఫై తాజా చిత్రం చూడవచ్చు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *