సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం నరసాపురం వారి కోడలు ,కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నరసాపురం, భీమవరం నియోజకవర్గాలలో పర్యటించి కేంద్ర ప్రభుత్వ నిదులల్తో చేపట్టిన పలు కార్యక్రమాలను సమీక్ష, మరియు నూతన శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో 1 కోటి 25 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో త్రాగునీటి పథకం లో భాగంగా నిర్మించిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ ను శ్రీమతి నిర్మల సీతారామన్ ప్రారంభించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ హాజరుఅయ్యి ఆమెకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపిక ను ఇచ్చి సత్కరించారు. భీమవరం నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయింపు చేస్తున్నందుకు స్థానిక ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అడ్జక్షుడు సోము వీర్రాజు, మంత్రి బుగ్గన రాజేంద్ర , పలువురు నేతలు జిల్లా అధికారులు వైసిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *